![Sudha rani commented over konda surekha - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/26/ks.jpg.webp?itok=Bh8jWoJe)
సాక్షి, హైదరాబాద్: కొండా దంపతులకు పదవుల కోసం పార్టీలు మారే అలవాటు ఉంద ని, అందుకే అన్ని పార్టీల ను సంప్రదిస్తున్నారని టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబా నిదని, ఉద్యమకారులపై దాడులు జరిపించిన చరిత్ర కొండా దంపతులదని ఆరోపించారు. మంగళవారం టీఆర్‌ఎస్ నేత గుడిమల్ల రవికుమార్‌తో కలిసి సుధారాణి తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఉన్నాయని సురేఖ అంటున్నారని, కానీ అలాం టి గ్రూపులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గురించి మాట్లాడే అర్హత కొండా దంపతులకు లేదని, వారిది పార్టీలో ఉండి వ్యతిరేక పనులు చేసే అలవాటని విమర్శించారు. కొండా దంపతులపై ప్రజలకు విశ్వాసం లేదని, వారికి దమ్ముంటే వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలని టీఆర్‌ఎస్ నాయకుడు గుడిమల్ల రవికుమార్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment