టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు (పాత చిత్రం)
అమరావతి : ప్రత్యేక హోదా ఒక్కటే తీసుకుని ప్రోత్సాహకాలను వదిలేయాలని వైఎస్సార్‌సీపీ చూస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం కూడా చంద్రబాబు టీడీపీ ఎంపీలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదాలో ప్రోత్సాహకాలు ఉండవని బీజేపీ అంటోంది. హోదా రాష్ట్రాలకు ఇచ్చిన ప్రోత్సాహకాలన్నీ ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారు. దక్షిణాదిలో నాయకత్వం బలహీన పరచాలని చూస్తున్నారు. సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.పోరాటంలో ఎవరూ వెనుకంజ వేయరాదు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోరాదు. ఎంపీలు సమన్వయంగా పనిచేయాలి. ఇది 5 కోట్ల ప్రజల సమస్య. ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈశాన్యరాష్ట్రాలకు కేంద్రం రూ.3 వేల కోట్లు విడుదల చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే నిధులలో కోత విధిస్తోంది. ఇది సరైన విధానం కాదు’ అని వ్యాఖ్యానించారు.
‘ఎవరిమీద మనం కుట్రలు, కుతంత్రాలు చేయడంలేదు. తెలుగుదేశం పార్టీ బలపడితే రాష్ట్రానికి రాజకీయంగా మేలు జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపట్టాం. తెలంగాణకు ఆదాయం ఎక్కువ, జనాభా తక్కువ. అందుకే తలసరి ఆదాయంలో చాలా ముందుంది. తలసరి ఆదాయంలో ఈ అంతరం పూడాలి. అందుకు తగిన తోడ్పాటు కేంద్రం అందించాల’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment