సాక్షి, అమరావతి: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల విషయంలోనూ అధికార పార్టీ టీడీపీ రాజకీయం చేస్తోంది. టీడీపీ నేతలు సిఫార్లు చేసిన ఖైదీలకే విడుదల విషయంలో ప్రాధాన్యత కల్పిస్తోంది. తాజాగా 33 మంది ఖైదీల విడుదలకు శనివారం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విడుదలకు 168 మంది ఖైదీలు అర్హత సాధిచినప్పటికీ.. కేవలం టీడీపీ నేతలు కోరుకున్న 33 మందిని మాత్రమే విడుదల చేస్తోంది. 128 మంది విడుదలను తిరస్కరించింది. తాజా కేబినేట్ నిర్ణయంతో మంత్రి ఆదినారయణ రెడ్డి సిఫారసు చేసిన ఆరుగురు ఖైదీలు అనంతపురం జైలు నుంచి విడుదలకానున్నారు. ఈ నిర్ణయంపై 128 మంది ఖైదీల కుటంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం 149 మంది అర్హత సాధించగా.. 49 మందిని మాత్రమే విడుదల చేసింది. కోర్టుకు వెళ్లి విడుదలకు అర్హత సాధించిన వాళ్లని కూడా ఈ సారి పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment