ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని.. | TDP Workers Attack YSRCP Activist In Kuppam | Sakshi
Sakshi News home page

ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని..

Published Wed, Apr 3 2019 12:45 PM | Last Updated on Wed, Apr 3 2019 2:03 PM

TDP Workers Attack YSRCP Activist In Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పచ్చతమ్ముళ్లు బరితెగించారు. తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని ఓ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడిపై రెచ్చిపోయి చితక్కొట్టారు. రామకుప్పం మండలం రాజుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీపై అభిమానంతో ఓ యువకుడు తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరవేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత నాగేంద్ర అతని అనుచరులు, వైఎస్సార్‌సీపీ జెండాను ఎలా ఎగరవేస్తారని యువకుడిని హెచ్చరించారు. తనకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమని, అందుకే జెండాను ఎగరవేశానని చెప్పాడు. ఈ సమాధానానికి రెచ్చిపోయిన పచ్చతమ్ముళ్లు.. ఇష్టారాజ్యంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా కుటుంబాన్నే లేపేస్తామని హెచ్చరించారు. దీంతో హడలిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement