సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ ఎంపీలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికలు జరిగిన 42 రోజుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో లాగే టీఆర్‌ఎస్ జోరు కొనసాగిస్తుందా.. కాంగ్రెస్ పు నర్‌వైభవం సాధిస్తుందా? బీజేపీ బోణీ కొడుతుం దా?.. ఏం జరగబోతుందో మరికొన్ని గంటల్లో తెలి యనుంది. మరో 24 గంటలు గడిస్తే కౌంటింగ్ ఉండడంతో గెలుపోటములపై ఇప్పటికే జోరుగా చర్చ సా గుతోంది. ఏప్రిల్ 11న ఈవీఎంలలో ఓటు నిక్షిప్తమైం ది. అటు దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఇటు రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అందరిని తొలు స్తుంది. ఆ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది.
42 రోజుల తర్వాత..
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బరిలో టీఆర్‌ఎస్ నుంచి గోడం నగేశ్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సోయం బాపురావులు తలపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బొర్లకుంట వెంకటేశ్‌నేత, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్, బీజేపీ నుంచి కుమార్ పోటీ పడ్డారు. దేశంలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగగా, తెలంగాణలో మొదటి విడతలోనే అన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 42 రోజుల తర్వాత ఫలితాలు వెలబడనుండడంతో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ సభ్యులుగా ఎవరు గెలుస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
2014లో కారు జోరు..
2014 సాధారణ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. అప్పుడు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ సభ్యులుగా గోడం నగేశ్, బాల్క సుమన్ గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి నగేశ్ మరోసారి బరిలో నిలిచారు. బాల్క సుమన్ గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేతకాని బరిలో నిలిచారు. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళా టీఆర్‌ఎస్‌లో చేరి పెద్దపల్లి అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు.
అన్ని నియోజకవర్గాల్లో..
లోక్‌సభ 2014 ఎన్నికల్లో అభ్యర్థుల పరంగా టీఆర్‌ఎస్ ముథోల్ మినహా అన్ని నియోజకవర్గాల్లో జోరు కనబర్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గోడం నగేశ్‌కు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన నరేశ్ జాదవ్‌పై మెజార్టీ లభించింది. ఒక్క ముథోల్‌లో మాత్రం నరేశ్ జాదవ్‌దే పైచేయి అయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బాల్క సుమన్‌కు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథనితోపాటు ఉమ్మడి జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో అధిక ఓట్ల ఆధిక్యం సాధించారు.
దీంతో కారు స్పీడ్‌ను హస్తం, సైకిల్ అందుకోలేక బొర్ల పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి గోడం నగేశ్, రాథోడ్ రమేశ్ బరిలో నిలిచారు. రాథోడ్ రమేశ్ కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి బరిలో నిలిచిన సోయం బాపురావు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చారు. ఇక పెద్దపల్లిలో మూడు పార్టీల నుంచి అభ్యర్థులు మారారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీ సాధించారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ప్రభావం..
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొదట్లో సోషలిస్ట్ పార్టీ ఒకసారి గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రభావం చాటుకుంది. 2004లో టీఆర్‌ఎస్ బోణి కొట్టింది. 2014లో మరోసారి గెలుపొందింది. ఇక పెద్దపల్లిలో 1962 నుంచి కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. మధ్యలో తెలంగాణ ప్రజాసమితి, తెలుగుదేశం పార్టీలే వేర్వేరు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2014లో టీఆర్‌ఎస్ బోణి కొట్టింది. ఇక ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటి వరకు బోణి చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment