ఇచ్చోడ: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం ఊ పందుకుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆయా స్థానా ల కు మంగళవారం నుంచి నామినేష న్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువు ఉంది. దీంతో చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రెండో రోజు 160 నామినేషన్లు..
మూడోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా రెండో రోజు మొత్తం 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు మండలాల్లోని ఆరు జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 26 నామినేషన్లు రాగా, 58 ఎంపీటీసీ స్థానాలకు 134 నామినేషన్లు వచ్చాయి. ఇచ్చోడ,సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్‌లోని ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మొత్తం 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి 39, టీఆర్‌ఎస్ నుంచి 46, ఇతర పార్టీ నుంచి ఒకటి, స్వతంత్రులు 13మంది అభ్యర్థులు నామినేషన్లు చేశారు. మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 26 నామినేషన్లు దాఖలు కాగా ఇచ్చోడలో ఏడు, సిరికొండలో రెండు, ఇంద్రవెల్లి లో మూడు, నార్నూర్‌లో ఐదు, గాదిగూడలో ఆ రు, ఉట్నూర్‌లో మూడు నామినేషన్లు వచ్చాయి.
నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు..
మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువుగా ఉంది. అనంతరం శుక్రవారం నామినేషన్లను ప రిశీలన ప్రక్రియ కొనసాగనుంది. పరిశీలనలో తి రస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునేం దుకు శనివారం వరకు గడువుంది. తద్వారా నా మినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే బరి లో ఉండే అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు.
జోరుగా నామినేషన్లు
Published Thu, May 2 2019 8:28 AM | Last Updated on Thu, May 2 2019 8:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment