నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత | Tension At Nizamabad Counting centre | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

Published Tue, Jun 4 2019 2:01 PM | Last Updated on Tue, Jun 4 2019 2:05 PM

Tension At Nizamabad Counting centre - Sakshi

సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ విజయం సాధించారు. అయితే, గెలుపొందిన సత్తెమ్మను టీఆర్‌ఎస్‌ శిబిరానికి తరలించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె తరలింపు విషయాన్ని గుర్తించిన బీజేపీ శ్రేణులు వెంటనే అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌-బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట అనంతరం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ ఇంటికి వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement