శశి థరూర్ (ఫైల్ ఫైటో)
తిరువనంతపురం : దేశంలో హిందుస్తాన్ తాలిబన్ కార్యక్రమాలను బీజేపీ ప్రారంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత శశి థరూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తాన్‌గా దేశాన్ని మారుస్తుందని ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేరళలో మంగళవారం ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ.. ‘బీజేపీకి చెందిన వారు నన్ను పాకిస్తాన్‌కి వెళ్లమంటున్నారు. నన్ను పాకిస్తాన్ వెళ్లమని చెప్పే అధికారం వారికి ఎవరిచ్చారు. నేను నా దేశంలో ఉండకూడదా. నేను వారిలాంటి హిందువును కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.
కేరళలో తన కార్యాలయంపై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడట్లు థరూర్ ఆరోపిస్తున్నారు. తనను దేశం విడిచి వెళ్లామని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారని తెలిపారు. 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారని ఇటీవల శశి థరూర్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment