టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు నామినేషన్ వేస్తున్న సంతోష్‌రావు, లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ∙కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్న బలరాం నాయక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. శ్రమశక్తి పార్టీకి చెందిన జాజుల భాస్కర్ కూడా నామినేషన్ వేశారు. దీంతో ఈసారి రాజ్య సభ స్థానాలకు పోలింగ్ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం ఉదయం తొలుత టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. వి.నర్సింహాచార్యులకు అందజేశారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల, జగదీశ్‌రెడ్డి, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం, టి.పద్మారావు, చీఫ్ విప్ కొప్పుల, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు వెంటరాగా అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లను దాఖ లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ సోమవారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్య దర్శికి అందజేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ ఉప నేత గీతారెడ్డి, విప్ సంపత్‌లతో కలసి ఆయన రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను మంగళ వారం స్క్రూటినీ చేయనున్నారు. అనం తరం ఈనెల 15వ తేదీ వరకు ఉపసంహ రణ గడువు ఉంటుంది. ఈలోగా ఎవరైనా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే ము గ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని, పోలింగ్ జరిగేలా చూడాలని యోచిస్తోంది. తద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని మరోసారి తెరపైకి తేవాలన్న వ్యూహంతో తమ అభ్యర్థి చేత నామినేషన్ దాఖలు చేయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న పోలింగ్ అనివా ర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment