
సాక్షి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌వి బూటకపు మాటలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంటే.. పక్కదారి పట్టించేందుకే థర్డ్ ఫ్రంట్ అంటూ లేని పోనీ రాజకీయాలు తెరపైకి తెస్తున్నారన్నారు.
తెలంగాణ గురించి తెలియని పవన్ కళ్యాణ్.. కేసీఆర్‌కు మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్‌లన్నారు.. ఆ ఇండ్లు కలగానే మిగిలిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment