
సాక్షి, కరీంనగర్ : అసహనంతోనే టీఆర్‌ఎస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓడి పోతాననే భయంతోనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకు పాల్పడుతోందని విమర్శిచారు. అంతేకాక తాను పార్లమెంట్ అభ్యర్థినని.. కానీ పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజా కూటమి సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికి టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కోడ్ ఉల్లంఘనలను, అధికార దుర్వినియోగాలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించారని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కసితో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
.
Comments
Please login to add a commentAdd a comment