సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్‌రెడ్డిపై చర‍్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక టీఆర్ఎస్ ఫౌండర్సు ఫోరం నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా... జడ్చర్లలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్‌రెడ్డి పలు విమర్శలు చేశారు. దీన్ని మంత్రి లక్ష్మారెడ్డి పత్రికా ముఖంగా ఖండిస్తూ విమర్శించారు. ఆ తర్వాత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి రేవంత్‌రెడ్డి పలు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక పత్రికల్లో రాయలేని పదాలను కూడా వాడడంతో ఆయనపై చర్య తీసుకోవాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment