‘రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన’ | Tughlak rule in the state says ysrcp | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన’

Published Mon, May 28 2018 10:41 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Tughlak rule in the state says ysrcp - Sakshi

దీక్షకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు 

దోమ : సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పరిగి ఎమ్మెల్యే తనయుడు రితిక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ దీక్షలకు రితిక్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాములునాయక్, తాలుకా యూత్‌కాంగ్రెస్‌ కన్వీనర్‌ శాంత్‌కుమార్, రాములు, దోమ మాజీ సర్పంచ్‌ రాంచంద్రారెడ్డి, రామేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ సంఘీభావం

 మండల కేంద్రంలో నిర్వహించిన నిరాహార దీ క్షకు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య మాట్లాడుతూ సీఎం చెప్పే మాటలు ఒకటి.. చేసే పని ఒకటని, తన సొంత లాభం కోసమే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి,విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, పరిగి, దోమ మండలాల అధ్యక్షులు విజయ్, హరిబా బు, ప్రధానకార్యదర్శి బాల్‌రాజ్, వెంకటేష్, సలీ ం, రాములు, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement