Guaranteed scheme
-
పెట్టుబడులు పెడితే రిస్క్ లేకుండా రాబడినిచ్చే ప్లాన్ ఇదే!
మన ప్రతి పెట్టుబడి ప్రణాళికలోనూ.. ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసా వెనుక భవిష్యత్‌లో ఆర్థిక భద్రత ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఈక్విటీల్లాంటి ఆర్థిక సాధనాలు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందించే అవకాశాలు ఉన్నా.. అదే స్థాయిలో రిస్కులు కూడా పొంచి ఉంటాయి. అలా కాకుండా భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక భరోసానిచ్చే ఇతరత్రా సాధనాలు కూడా ఉన్నాయి. గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్ ఇదే కోవకి చెందినది. గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్ అంటే.. సాధారణంగా కచ్చితమైన రాబడి హమీని కూడా అందించే జీవిత బీమా ప్లాన్లను గ్యారంటీడ్ ఇన్‌కం పథకాలుగా వ్యవహరిస్తుంటారు. పేరుకు తగ్గట్లుగానే ఎటువంటి అనిశ్చితి లేకుండా ఈ పథకాలు ముందుగా పేర్కొన్నట్లు కచ్చితమైన రాబడులు అందించేవిగా ఉంటాయి. ఈ తరహా ప్లాన్లలో ప్రీమియం చెల్లింపు వ్యవధి, లేదా పాలసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత క్రమానుగతంగా నెలవారీ, మూడు .. లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దిష్ట చెల్లింపులను ప్రారంభిస్తుంది. గ్యారంటీడ్ ప్లాన్లతో మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. సులభతరంగా ఆర్థిక లక్ష్యాల సాధన.. జీవితంలో కొన్ని లక్ష్యాలు చాలా సరళమైనవిగా ఉంటాయి. వాటి కోసం తీవ్రంగా ప్రణాళికలు అవసరం ఉండదు. ఉదాహరణకు ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు కోసమో లేదా విహార యాత్రల కోసమో ఏళ్ల తరబడి ప్లాన్ చేసుకుంటూ గడిపేయనక్కర్లేదు. అయితే, మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడం వంటి అవసరాల కోసం మాత్రం ప్లానింగ్ చేసుకోవాలి. క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయాలి. జీవితంలో కీలకమైన ఆర్థిక లక్ష్యాలను కొంత సులభంగా సాధించుకోవడంలో గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్ మీకు తోడ్పాటునిస్తుంది. మీరు మీ హోమ్ లోన్ ఈఎంఐ తిరిగి చెల్లించేసేందుకు, తద్వారా మీపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, క్రమానుగతంగా వచ్చే రాబడులను మీ పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు. అదనపు ఆదాయ మర్గం.. మీ భవిష్యత్ లక్ష్యాల కోసం ఇతరత్రా పెట్టుబడులు ఉన్నప్పటికీ.. మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఈ తరహా ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరిగే ఖర్చులను ఎదుర్కొనేందుకు మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ వేతనానికి తోడుగా.. అదనపు ఆదాయ వనరుగా తోడ్పడగలదు. ఇక రిటైర్మెంట్ తర్వాత మీ ప్రాథమిక ఆదాయ వనరు స్థానాన్ని తీసుకోగలదు. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ.. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ ఉండటం కూడా ఇలాంటి గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్లతో మరో ప్రయోజనం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు అధికంగా ఉంటే .. రిస్కులు కూడా ఎక్కువే ఉంటాయి. ఒక్కసారి మార్కెట్లు కుప్పకూలాయంటే చాలా నష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గించేలా గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్ ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, రిస్కులు అంతగా ఇష్టపడని వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, కచ్చితమైన రాబడులు అందిస్తుంది కాబట్టి రిస్కులు తీసుకునే వారికి కూడా ఇవి అనువైనవే. చివరిగా చెప్పాలంటే.. పైన చెప్పుకున్న ప్రయోజనాలతో పాటు మీకు జీవిత బీమా కవరేజీ కూడా ఈ తరహా పథకాలతో లభిస్తుంది. తద్వారా మీరు మీ భవిష్యత్‌కు ఆర్థికంగా రక్షణ కల్పించుకోవడంతో పాటు ఏదైనా అనుకోనిది జరిగినా మీ కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా గ్యారంటీడ్ ఇన్‌కం ప్లాన్లు ఉంటాయి. అంతే కాదు ప్రీమియంలకు పన్నులపరంగా డిడక్షన్లు పొందవచ్చు. వచ్చే రాబడులపై పన్నుల భారం ఉండదు. -
‘రాష్ట్రంలో తుగ్లక్ పాలన’
దోమ : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని యూత్ కాంగ్రెస్ నాయకుడు, పరిగి ఎమ్మెల్యే తనయుడు రితిక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలకు రితిక్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాములునాయక్, తాలుకా యూత్‌కాంగ్రెస్ కన్వీనర్ శాంత్‌కుమార్, రాములు, దోమ మాజీ సర్పంచ్ రాంచంద్రారెడ్డి, రామేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సంఘీభావం మండల కేంద్రంలో నిర్వహించిన నిరాహార దీ క్షకు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య మాట్లాడుతూ సీఎం చెప్పే మాటలు ఒకటి.. చేసే పని ఒకటని, తన సొంత లాభం కోసమే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి,విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, పరిగి, దోమ మండలాల అధ్యక్షులు విజయ్, హరిబా బు, ప్రధానకార్యదర్శి బాల్‌రాజ్, వెంకటేష్, సలీ ం, రాములు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కలే
పెళ్లకూరు, న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ‘హామీ’ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి ఉన్న చోటే కూలీలకు పని కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల్లో ఒక పక్క కరువు విలయతాండవం చేస్తుంటే.. బతుకుతెరువు కోసం పల్లె జనం పరితపిస్తున్నారు. తాజాగా వ్యవసాయ పనులు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు ఉన్నచోట పనిలేక వలసబాట పడుతున్నారు. ఉపాధి పనులు సక్రమంగా చేయించడం లేదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం లేదని గతంలో కొందరు ఉపాధి క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించారు. అయితే స్థానిక ఉపాధి పథకం అధికారులు అత్యుత్సాహంతో తొలగించిన వారికే మళ్లీ పనులు అప్పగించి సీనియర్ మేట్లుగా నియమించడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం 10,510 మందికి ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. అయితే వీరిలో కనీసం వంద మందికి కూడా పూర్తిస్థాయిలో పని కల్పించకపోతున్నారు. 2014-15 ఏడాదికి మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.5.45 కోట్లతో పనులు చేపట్టాలని అంచనాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి నుంచి కూలీలకు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే పెళ్లకూరు, రావులపాడు, పుల్లూరు, కొత్తూరు, కానూరు, పెన్నేపల్లి, చింతపూడి, తాళ్వాయిపాడు గ్రామాల్లో పనులు చేపట్టకపోవడం విశేషం. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడని పలువురు రోజువారీ కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. సస్పెండైన ఫీల్డ్ అసిస్టెంట్లకే పనుల అప్పగింత ఉపాధి కూలీలకు పని కల్పించకుండా సొంత పనులు చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని పలువురు ఉపాధి సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే వారి స్థానంలో సీనియర్ మేట్లను నియమించుకుని ఉపాధి పనులు నిర్వహించాల్సిన ఇక్కడి అధికారులు అత్యుత్సాహంతో తిరిగి తొలగించిన వారికే పనులు అప్పగించారు. దీంతో అనకవోలు, చావాలి, కానూరు, కొత్తూరు, రావులపాడు, పెళ్లకూరు, పుల్లూరు, పెన్నేపల్లి, నందిమాల, చెన్నప్పనాయుడుపేట, రోసనూరు తదితర గ్రామాల్లో పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకవోలు రూ.20 లక్షలు, సీఎన్‌పేట రూ.13 లక్షలు, చెంబేడు రూ.59 లక్షలు, పెళ్లకూరు రూ.37 లక్షలు ఇలా అన్నీ పంచాయతీల్లో సుమారు రూ.5.45 కోట్లకు పైగా పనులు చేయాలని అంచనాలు రూపొందించారు. అయితే ఉపాధి పనులు ని ర్వహించడంలో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆశాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కూలీలకు ఉపాది పనులు కల్పించాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా ఉపాధి పనులు చూపడం లేదు గ్రామంలో వ్యవసాయ సీజన్ ముగియగానే పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధి క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఐదేళ్లుగా ఉపాధి పనులు లేవు. కుటుం బంలో వృద్ధులను, పిల్లలను వదిలి పనుల కోసం వలస వెళుతున్నారు. నటరాజన్, ఉపాధి కూలి, పెళ్లకూరు క్షేత్ర సహాయకులను నియమించాలి పలు గ్రామాల్లో క్షేత్ర సహాయకులు లేక పనులు జరగడం లేదు. కొన్ని చోట్ల తొలగించిన వారికే పనులు అప్పగించడంతో వారు సొంత పనులకు పరిమితమయ్యారు. జిల్లా అధికారులు స్పందించి కొత్తగా సిబ్బందిని నియమించాలి. మోహన్, కూలీ చర్యలు చేపడుతాం : వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చూపని సిబ్బందిని గుర్తించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతాం. సొంత పనులు, ప్రైవేట్ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తూ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి తొలగించి కొత్తవారిని నియమిస్తాం. గౌతమి, ఉపాధి పీడీ