మరింత సంక్షోభంలోకి నెట్టేలా బాబు చర్యలు | Vasireddy Padma Fire on Chandrababu over Farmers Issues | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 22 2017 3:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Vasireddy Padma Fire on Chandrababu over Farmers Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాయలంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయ రంగానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని.. రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు బ్యాంకులు కొత్తగా అప్పులు ఇచ్చే పరిస్థితులు కనిపించటం లేదని.. పైగా వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా టీడీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని  పద్మ తెలిపారు.

ల్యాండ్‌ పుల్లింగ్‌ పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారు.. టీడీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. పైగా ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని ఆమె చెబుతున్నారు. రేపు రైతు దినోత్సవం సందర్భంగా తన పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా చంద్రబాబుకు ఆమె సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement