సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మహోద్యమంగా మారిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర ఏపీ భవిష్యత్‌ను మార్చనుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి 2019 చారిత్రాత్మక సంవత్సరంగా మారనుందని.. ప్రజలు స్వర్ణయుగంలోకి అడుగుపెట్టనున్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరం పాటు అకుంఠిత దీక్షతో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించారని గుర్తుచేశారు. తిమ్మిని బమ్మి చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరితేరారని విమర్శించారు.
ఫిరాయింపులను ప్రోత్సహించి ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఐటీ, సీబీఐ రాకూడదని చంద్రబాబు చెప్పడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు రోజురోజుకి దిగజారుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాలతో అధికార పీఠమెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకు కూడా చంద్రబాబు యత్నించారని ఆరోపించారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయినట్టు నటిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కాంగ్రెస్‌తో జట్టు కట్టడం దిగజారుడు తనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంట గెలవలేక బయట రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని.. వలసల పెరిగిపోతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment