‘చంద్రబాబు రోత చూసి వాళ్లే విసిగిపోతున్నారు’ | Vasireddy Padma Slams Chandrababu Over His Comments On Cabinet Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రోత చూసి విసిగిపోతున్నారు : వాసిరెడ్డి పద్మ

Published Sat, May 4 2019 1:17 PM | Last Updated on Sat, May 4 2019 1:27 PM

Vasireddy Padma Slams Chandrababu Over His Comments On Cabinet Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలు తీర్పు అర్థమయ్యే చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఫొని తుపానును జాగ్రత్తగా తానే పక్కకు తప్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన పాపాలపుట్ట బద్దలవుతుందన్న భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం సాధించారని...కనీసం ఒక్క క్యాబినెట్ మీటింగ్ అయినా భూకేటాయింపులు లేకుండా జరిగిందా అని ప్రశ్నించారు. అలాంటిది మరి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

చదవండి : ఎవరు అడ్డుకుంటారో చూస్తా...!

మీ రోత చూసి విసిగిపోతున్నారు..
‘ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి ఉంది. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. మీ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ కనబడటం లేదు. వారంతా చంద్రబాబు రోత చూసి విసిగిపోతున్నారు. ఓడిపోతామనే తెలిసి వాళ్లంతా సొంత పనుల్లో ఉన్నారు. ఐదేళ్లుగా అవినీతి, అరాచకాలు చేసి... ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నారు. వైఎస్‌ జగన్‌ నవ్వినా ఆయన ఏడుస్తున్నారు. వైఎస్ జగన్‌కు జీవించే హక్కు లేకుండా చంపాలని చూశారు. కనీసం ఆయనకు సినిమాకు వెళ్లే హక్కు కూడా లేదా. టీటీడీ బంగారం వ్యవహారంపై స్పందించని చంద్రబాబు వైఎస్‌ జగన్‌ సినిమాకు వెళ్తే మాత్రం మాట్లాడతారు. మీ లోకేష్ ఎక్కడున్నారో చెప్పండి. కోడెల ఎదుర్కొన్న పరిస్థితి మరే టీడీపీ నేతలు తెచ్చుకోవద్దు’ అని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement