
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అలీబాబా దొంగల పార్టీ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు విజయ్ చందర్ అభివర్ణించారు. విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు మితిమీరిపోతున్నాయని, ఆయనని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ ప్రజలు నష్టపోయారని వెల్లడించారు. బ్రిటీషర్లను ఎదిరించిన చరిత్ర తెలుగు జాతిదని అని చెప్పారు. చంద్రబాబు మోసాలను గమనించి అదే రీతిన దెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment