Vijaya Chander
-
ప్రభుత్వం కుప్పకూలిపోతుందా..ఎందుకంత భయం బాబు?
సాక్షి, హైద్రాబాద్ : ఒక్క సినిమా తీస్తేనే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ విజయచందర్.. సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సోమవారమిక్కడ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను నిర్బంధించడం సరికాదని హితవు పలికారు. వర్మ ప్రెస్‌మీట్ పెడితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమిటని, ఎందుకంత భయపడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. అసలు ఏ ఉద్దేశంతో వర్మను నిర్బంధించి బయటకు పంపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు కదా.. ‘ ప్రెస్‌మీట్ పెట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా. వర్మకు ప్రెస్‌మీట్ పెట్టే హక్కు ఉందా లేదా అసలు. కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు బయోపిక్‌లకు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారే. మరి ఇతర చిత్రాల గురించి ఆవిధంగా ప్రచారం చేసుకోకూడదా. ఓ వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు’అని విజయచందర్ మండిపడ్డారు. -
టీడీపీ అలీబాబా దొంగల పార్టీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అలీబాబా దొంగల పార్టీ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు విజయ్ చందర్ అభివర్ణించారు. విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు మితిమీరిపోతున్నాయని, ఆయనని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ ప్రజలు నష్టపోయారని వెల్లడించారు. బ్రిటీషర్లను ఎదిరించిన చరిత్ర తెలుగు జాతిదని అని చెప్పారు. చంద్రబాబు మోసాలను గమనించి అదే రీతిన దెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
జగన్ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకం
-
బాబా భక్తుల అనుభవాలతో...
విజయచందర్ సాయిబాబాగా నటించిన తాజా చిత్రం ‘సాయే దైవం’. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ, పొనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి నిర్మించారు. ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని విజయచందర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ‘‘30 ఏళ్ల క్రితం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’లో సాయిబాబా పాత్ర చేశా. మళ్లీ ఆ పాత్ర చేసే చాన్స్ రావడం నా అదృష్టం’’ అని విజయచందర్ అన్నారు. -
డీఆర్వోగా ప్రభావతి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ అధికారిగా ఆలపాటి ప్రభావతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఆర్వోగా పనిచేసిన ఎల్.విజయచందర్ పొట్టి శ్రీరాములు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో ప్రభావతి ఆదివారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును విజయవాడలో కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 16న ప్రభావతిని డ్వామా పీడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్వామా పీడీగా ఉన్న అనిల్‌కుమార్‌ను కొద్దికాలంలోనే బదిలీ చేయడమేమిటని ప్రశ్నిస్తూ ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనిల్‌కుమార్‌ను పీడీ విధుల్లో కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రభావతిని జిల్లాకు కేటాయించినా పోస్టింగ్ ఇవ్వకపోవటంతో ఆదివారం కలెక్టర్ రఘునందన్‌రావు ఆమెను డీఆర్వోగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.