డీఆర్వోగా ప్రభావతి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ అధికారిగా ఆలపాటి ప్రభావతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఆర్వోగా పనిచేసిన ఎల్.విజయచందర్ పొట్టి శ్రీరాములు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో ప్రభావతి ఆదివారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును విజయవాడలో కలిసి బాధ్యతలు స్వీకరించారు.
ఫిబ్రవరి 16న ప్రభావతిని డ్వామా పీడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్వామా పీడీగా ఉన్న అనిల్‌కుమార్‌ను కొద్దికాలంలోనే బదిలీ చేయడమేమిటని ప్రశ్నిస్తూ ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనిల్‌కుమార్‌ను పీడీ విధుల్లో కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రభావతిని జిల్లాకు కేటాయించినా పోస్టింగ్ ఇవ్వకపోవటంతో ఆదివారం కలెక్టర్ రఘునందన్‌రావు ఆమెను డీఆర్వోగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.