
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సవాల్ విసిరారు. తాను చెప్పిన కొన్ని పదాలను అపశబ్ధం లేకుండా ఉచ్చరించాలన్నారు. శనివారం ట్వీటర్ వేదికగా నారా లోకేష్, స్పీకర్ కోడెలపై మండిపడ్డారు. ‘లోకేశ్.. నాదో చిన్నకోరిక. ఈ పదాలు అపశబ్ధం లేకుండా ఉచ్ఛరించాలి. దేవాన్ష్, బ్రాహ్మణి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ, గుంటూరు, మంగళగిరి, బుద్ధవిగ్రహం,డెంగీ. స్పష్టంగా పలికితే మంగళగిరి పోరులో సగం గెల్చినట్టే. లేదనుకో మీ తండ్రి శాశ్వతంగా అధికారానికి దూరమవుతాడు.’ అని ట్వీట్ చేశారు. ఇక సత్తెనపల్లిలో పోలింగ్ బూత్ ఆక్రమణకు ప్రయత్నించి స్పీకర్ పదవికే కోడెల మచ్చ తెచ్చారన్నారు. ఐదేళ్లు స్పీకర్ కొడుకు ప్రజలను అనేక రకాలుగా హింసించాడని, తీవ్ర ప్రజా వ్యతిరేకత కనబడటంతో రిగ్గింగుకు ప్రయత్నించారని ఆరోపించారు. యువకులు అడ్డుకోవడంతో చొక్కా చించుకుని, సొమ్మసిల్లినట్టు నాటకమాడారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment