సాక్షి, అమరావతి: కరోనా కాలంలోనూ అసత్య ప్రచారాలకు దిగుతున్న ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మేరకు మంగళవారం ఆయన తన ట్విటర్ ఖాతాలో.. ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 1500 పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇంకెక్కడైనా ఇంత వేగంగా, సకల సౌకర్యాలతో తాత్కాలిక ఆస్పత్రి తయారైందేమో గూగుల్‌లో వెతికి చూడండి.. పచ్చ తమ్ముళ్లూ అని సెలవిచ్చారు. ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉండటం రాష్ట్రం అదృష్టమని కొనియాడారు. (భారీగా కరోనా టెస్టులు)
మరో ట్వీట్‌లో విజయసాయి రెడ్డి టీడీపీ రాజకీయాలను విమర్శిస్తూ.. "బాబోయ్.. మీ గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించే వరకూ వెళ్లిందా? ఉత్తరాంధ్ర ప్రజలు ఏం పాపం చేశారు? మీ కుట్ర ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి టీ కప్పులో సునామీ కథనాలు మానుకోండి. ప్రజల్ని హాయిగా బతకనివ్వండి. కుదిరితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించండ"ని హితవు పలికారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!)
Comments
Please login to add a commentAdd a comment