
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆత్మీయ ఆలింగనంతో అభినందనలు తెలిపినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడంతో తమ అధినేత వైఎస్ జగన్‌ను 10.30 గంటలకు స్వయంగా కలిసానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సైతం షేర్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 150 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో 21 స్థానాల్లో గెలుపుదిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
A warm and Congratulatory memorable hug to the New Chief Minister of Andhra Pradesh and our beloved Leader Sri.YS Jagan Garu on 23rd May 2019 at 10.30am. pic.twitter.com/DD6lvdBonj
— Vijayasai Reddy V (@VSReddy_MP) 23 May 2019
Comments
Please login to add a commentAdd a comment