'వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా' | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా: విజయసాయి రెడ్డి

Published Sun, Mar 8 2020 12:03 PM | Last Updated on Sun, Mar 8 2020 1:23 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి చర్యలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. సీఎం జగన్ పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 59.85% అణగారిన వర్గాలకు బీ-ఫారాలు ఇస్తారు. ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ. బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: మిరాకిల్‌: 15 క్యాన్‌ల బీరు తాగించి బతికించారు

కాగా మరో ట్వీట్‌లో.. 'రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. ఏటా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా సీఎం జగన్ గారు వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చదవండి: నువ్వు, నీ తుప్పుపట్టిన సైకిల్‌ తుక్కు తుక్కే..

'యస్‌ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement