సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ హాస్సిటల్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి కార్మికులు చనిపోయారని ఆరోపించారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలంటూ ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. (చదవండి : 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు')
ఎల్లో కుల మీడియా బుద్ధి మరోసారి బయట పడింది. పోలీసులు అచ్చెన్న ఇంటి గోడ దూకి అరెస్ట్ చేశారట. గేటు తెరవకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి రప్పించే యత్నం చేయడంతో అలా చేయాల్సి వచ్చిందని ఏసీబీ జేడీ మీడియాకు చెప్పారు. అయినా ‘మాకు వినపడలేదు’ అంటూ యజమాని చెప్పినట్టు రాశారు అని విజయసాయిరెడ్డి విమర్శించారు. (చదవండి : అచ్చెన్నకు మా ఉసురే తగిలింది)
‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు - చెత్తపలుకు ఆపడు- వ్యాపార ప్రయోజనాలకోసమే వైసీపీలో టీడీపీ నేతలు చేరుతున్నారు అంటున్నాడు. గతంలో 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుక్కుని టీడీపీలోకి చట్ట వ్యతిరేకంగా చేర్చుకుని అభివృద్ధికోసమేనంటూ అప్పట్లో ఊగిపోయాడు. ఈ ద్వంద ప్రమాణాలేంటి కిట్టప్ప!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘కరోనాపై జగన్ గారు మొహం చాటేస్తున్నారంటూ చెత్తరాతలేంటి కిట్టు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు! తమిళనాడులో దుస్థితి చూడు. టీడీపీ హయాంలో ఫైల్స్ చూసి ఎక్కడ సంతకాలు పెట్టాలో చంద్రబాబుకు చెప్పి కమీషన్లు కొట్టేసేవాడివి.ఇప్పుడు ఆ అవకాశం లేదనేనా నీ బాధంతా కిట్టన్న! ’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment