సాక్షి, నల్గొండ: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఇద్దరు నేతలు మధ్య పరస్పర విమర్శలకు దిగారు. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా... వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్ పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి జగదీష్ సెటైర్ వేయగా.. ‘నువ్ మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ వేశారు.
(చదవండి: కరోనా: తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు)
Comments
Please login to add a commentAdd a comment