
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తామే కీలకం కాబోతున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... తాము కింగ్ మేకర్లం కాదని, కింగే అవుతామని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీజేఎస్ ఎవరితోను పొత్తు పెట్టుకోదని, స్వతంత్రంగా ఒంటరిగానే పోటీ చేస్తుందని కోదండరాం స్పష్టం చేశారు. అలాగే వచ్చే పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో జాతీయ పార్టీల పట్ల ప్రజలలో ఆదరణ తగ్గుతోందని కోదండరాం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తెలంగాణ జన సమితి పనిచేస్తోందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment