‘అందుకే అతను వైఎస్సార్‌ సీపీ వాడని ప్రచారం..’ | We Will Definitely Win In Local Body Elections Says YV Subba Reddy | Sakshi
Sakshi News home page

ఆ ఎన్నికల్లో విజయఢంకా మోగించటం తధ్యం

Published Sat, Mar 7 2020 4:08 PM | Last Updated on Sat, Mar 7 2020 4:19 PM

We Will Definitely Win In Local Body Elections Says YV Subba Reddy - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని  వైఎస్సార్‌ సీపీ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్ధుల విజయానికి బాటలు వేస్తాయన్నారు. శనివారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాకినాడ పార్లమెంటరీ నేతలు, కార్యకర్తలతో వైవి సుబ్పారెడ్డి చర్చించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చిత్తశుద్ధితో 59.83 శాతం అమలు చేయాలని చూశామని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు బీసీ ద్రోహులుగా కోర్టు ద్వారా ఆ ప్రక్రియను అడ్డుకున్నారని మండిపడ్డారు. ( ‘స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి’ )

ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి సుమారు రూ. 5 వేల కోట్ల సాయం నిలిచిపోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే సీఎం జగన్ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతాప్ రెడ్డి టీడీపీ నాయకుడని, సామాజికవర్గాన్ని బట్టి అతను వైఎస్సార్‌ సీపీకి చెందిన వాడని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement