సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పించినట్లు గుర్తుచేశారు. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలుసుకుని, పలు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. రాజమండ్రిలో గురువారం ఓంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జూన్ 11 సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తారని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో 300 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ జననేత జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
సుమిత్రా మహాజన్‌ను కలుస్తాం: వైవీ సుబ్బారెడ్డి
Published Thu, May 24 2018 6:05 PM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment