యూపీ మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్ (ఫేస్‌బుక్ ఫోటో)
లక్నో : యూపీ మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్ గురువారం సీఏఏకు వ్యతిరేకంగా బిజ్నూర్‌లో జరిగిన అల్లర్లలో గాయపడిన ఓం రాజ్‌షైని అనే వ్యక్తిని పరామర్శించారు. గత శుక్రవారం ఓంరాజ్ తన పొలం నుంచి తిరిగి తన ఇంటికి వస్తుండగా, వీధుల్లో అక్రమ ఆయుధాలు కలిగి అల్లర్లకు పాల్పడుతున్న కొందరు వ్యక్తుల చేతిలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో మంత్రి ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు. మరోవైపు ఈ అల్లర్లలో ఇద్దరు ముస్లిం యువకులు చనిపోయారు. అయితే మంత్రి మాత్రం వారి ఇళ్లకు వెళ్లలేదు. దీనిపై ఓ రిపోర్టర్ ‘మీ ప్రభుత్వం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అని అంటుంది కదా. చనిపోయిన ముస్లిం కుటుంబాలను ఎందుకు మీరు పరామర్శించలేదు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాద్రా పరామర్శకు వచ్చినప్పుడు ఓం రాజ్‌తో పాటు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను కూడా పరామర్శించారు కదా? అని ప్రశ్నించింది.
‘అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లకు నేనెందుకు వెళ్లాలి. అల్లర్లతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, సమాజంలో అశాంతి రేపాలనుకునేవారు సభ్య సమాజంలో భాగంగా ఉన్నారని ఎలా అనుకుంటాం? ఇది హిందూ - ముస్లిం సమస్య కాదు. హింసకు పాల్పడేవారి ఇళ్లకు నేను వెళ్లను’ అని మంత్రి బదులిచ్చారు. కాగా, నిరసన ప్రదర్శనల్లో చెలరేగిన హింస కారణంగా యూపీ వ్యాప్తంగా 21 మంది చనిపోయిన విషయం తెలిసిందే. చదవండి : సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment