టీడీపీని వీడుతున్నా: మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి | Yalamanchili ravi join in ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడుతున్నా: మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి

Published Sat, Apr 14 2018 3:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Yalamanchili ravi join in ysrcp  - Sakshi

పటమట(విజయవాడ తూర్పు): హామీలను నెరవేర్చకుండా పొంతన లేని సమాధానాలు చెప్పటం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేర్కొన్నారు. చంద్రబాబు తనను రెండు సార్లు మోసం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు.

కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  శుక్రవారం విజయవాడ పటమటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో  మాట్లాడారు. గతంలో ప్యాకేజీ మంచిదన్న చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చెప్పారు.

నేడు వైఎస్సార్‌ సీపీలోకి
ప్రజా సంకల్ప యాత్ర శనివారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కనక దుర్గ వారధి వద్ద అభిమానులు, కార్యకర్త లతో కలసి ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరుతు న్నట్లు యలమంచిలి రవి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement