సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరోసారి శవ రాజకీయాలకు తెర తీశారు. గుండెపోటుతో రైతు మరణిస్తే.. ఆయన మరణాన్ని రాజధాని వికేంద్రీకరణ పరిణామాలకు ముడిపెట్టారు. కొమ్మినేని నాగమల్లేశ్వర్రావు అనే రైతు రాజధానిలో తనకున్న 1.2 ఎకరాలను రూ. 1.8 కోట్లకు విక్రయించారు. ఆ డబ్బుతో పిడుగురాళ్ల సమీపంలోని వీరాయపాలెంలో 10 ఎకరాలు, వడ్లమన్నులో నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం ఉదయం దొండపాడులో గుండెపోటుతో మరణించారు.(మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!)
రాజధాని అంశంపై బీసీజీ ఇచ్చిన నివేదికలో న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కొమ్మినేని నాగమల్లేశ్వర్రావు మరణాన్ని రాజధాని అంశంతో ముడిపెట్టారు. నిజాలను దాచిపెట్టి దుర్మార్గపు ప్రచారానికి తెరతీశారు. ఇక ఎల్లోమీడియా ఆయన ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం గమనార్హం.
వృద్ధురాలి మృతిని సైతం..
ప్రకాశం: వృద్ధురాలి మృతిని సైతం కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి రాజకీయానికి వాడుకున్నారు. గుండెపోటుతో సదరు వృద్ధురాలు మరణిస్తే పెన్షన్ రాక చనిపోయిందంటూ రాద్దాంతం చేశారు. కొండేపి మండలం వెన్నూరులో జరిగిన ఘటనపై విచారణకు వచ్చిన ఏపీడీని సైతం తాను చెప్పిందే వినాలంటూ హుకుం జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment