అకృత్యాలపై ఆగ్రహం | YSRCP Candle Rally On Women Protection kurnool | Sakshi
Sakshi News home page

అకృత్యాలపై ఆగ్రహం

Published Sun, May 6 2018 8:30 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

YSRCP Candle Rally On Women Protection kurnool - Sakshi

కోవెలకుంట్లలో చేపట్టిన కార్యక్రమంలో శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బాలికలు, మహిళలపై లైంగిక దాడులను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట పార్టీ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య టీడీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ చోటామోటా నాయకులు మొదలు ప్రజాప్రతినిధులు, మంత్రుల వరకు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గుండాలు, రౌడీలుగా  మహిళలపై దాడులకు దిగుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు.

నాలుగేళ్ల పాలనలో ఎంతోమంది మహిళలను టీడీపీ నాయకులు కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్లలో ఇరికించి వారి జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యార ని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో పటేల్‌ సెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు అమ్మ హాస్పిటల్‌ సమీపంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో పార్టీ యూత్‌ నాయకుడు అక్కిమి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎమ్మిగనూరులో పార్టీ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, కోడుమూరులో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, ఆదోనిలో పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రసాదరావు, ఆలూరులో మండల కన్వీనర్‌ చిన్న ఈరన్న, మంత్రాలయంలో సర్పం చ్‌ తల్లెబండ్ల భీమప్ప, నంద్యాలలో మాజీ ఎంపీపీ జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement