సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం జరిగిన బూత్ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనను రాష్ట్రంలో తిరిగి తీసుకురావాలని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి అధికార యావ ఉందని టీడీపీ నేతలంటున్నారు.. అవును అధికారంలో ఉంటేనే ప్రజల కోరికలు తీర్చగలం..అందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నామన్నారు. టీడీపీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇంకో 20 ఏళ్ల పాటు అభివృద్ధికి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇసుక, మట్టి నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చని టీడీపీ నేతలు నిరూపించారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. టీడీపీ వల్ల ఏపీకి ఎంత నష్టం జరిగిందో.. బీజేపీ కూడా అంతే నష్టం చేసిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీకి, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని స్సష్టం చేశారు. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో టీడీపీ నేతల అవినీతిని విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలిపునిచ్చారు. 2014 ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాలేకపోయిందని, పార్టీకి బూత్ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలే పట్టుకొమ్మలు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment