సాక్షి, వైఎస్సార్ కడప : ‘తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి చంద్రబాబును మరోసారి సీఎం చేసేందుకు పవన్ ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. పవన్ ఓ మిస్టర్ కన్ఫ్యూజన్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన విశాఖ భూ కుంభకోణాలపై మాట్లాడని పవన్.. జగన్ వస్తే భూములు ఖాళీ అని విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బాబుకు గొడుగుపట్టి ఆయనను మరోసారి సీఎం చెయ్యడమే నీ టార్గెటా..? జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందంటూ చంద్రబాబు వెర్రికూతలు కూస్తారు. నీ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది కాబట్టే.. రాత్రికిరాత్రే అమరావతికి పారిపోయి వచ్చావ్ కదా. చేగువేరా.. అంటూ పవన్ ఏవేవో చెప్తుంటే.. ఏదో చేస్తాడని అనుకున్నాం. కానీ, నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు. ప్యాకేజీ పవన్ అని ప్రజలనుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబును అర్ధరాత్రి కలిసాడు. అనంతరం జనసేన నుంచి పోటీకి దిగుతున్నట్టు పవన్ ప్రకటించాడు. మళ్లీ పవన్ ప్రవచనాలు చెప్పుకొస్తాడు’ అని రామచంద్రయ్య చురకలంటించారు. గతంలో లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. ఆయనపై ఎందుకు అభ్యర్థిని పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎంతకైనా దిగజారుతుంది..!
‘రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు ఎక్కువవుతున్నాయని రామచంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తెరలేపేందుకు టీడీపీ వెనకాడదని విమర్శిచారు.తుని రైలు ఘటన, అమరావతిలో పంట దహనం వంటి అరాచకాలకు పాల్పడిన టీడీపీ అవన్నీ వైఎస్సార్‌సీపీపైన నెట్టేందుకు యత్నించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ జరిగిన హత్యాయత్నం ఘటనను కూడా తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ యత్నించింది. రాఫ్ట్రంలో గాడి తప్పుతున్న శాంతి భద్రతలపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలి. ఈసీ ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేయాలి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment