
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నేతలు కోడి కత్తి అంటూ ఎగతాళి చేశారని, దర్యాప్తు జరిగితే కోడి కత్తో.. నారా కత్తో తేలుతుందని వైఎస్సార్ సీపీ నేత ఇక్బాల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఐఏ దర్యాప్తును అడ్డుకోవటం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడే అబద్ధాలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలకు మొహం చూపించడానికి చంద్రబాబుకు అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకోవటం కాదు.. మొహానికి నల్లరంగు పూసుకోవాలంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేసింది చంద్రబాబేనన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటం వల్లే హోదా సజీవంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment