
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరాచక పాలన త్వరలో అంతం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.యన్టీఆర్‌పై తీసిన లక్ష్మీస్ యన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు కుయుక్తులు పన్నారని విమర్శించారు. చివరికి మహిళనైన తనతో కూడా చాలా దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు పచ‍్చ మీడియా కూడా వత్తాసు పలికిందని లక్ష్మీ పార్వతి అన్నారు.
చంద్రబాబు నాయుడువి మొదట్నుంచి అడ్డదారి రాజకీయాలేనని... ఇలాంటి పాపాల భైరవుని పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని...దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలో విముక్తి రానుందని లక్ష్మీపార్వతి అన్నారు. ఈ నెల 23న రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రానుందని, తమ పార్టీ గెలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ‍్యమంత్రి కావడం తథ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment