
లక్ష్మీ పార్వతి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాను గాలి బాగా వీస్తోందని, 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌సీపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను పూర్తి చేయలేదని చెప్పారు.
ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. స్పెషల్ విమానాలను వాడి ప్రజల ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు ప్రజలకు వెన్నుపోటువరకు చంద్రబాబుకు ప్రజాతీర్పులో శిక్ష తప్పదని శపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment