సాక్షి, గుంటూరు : రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. అసాధ్యమైనదాన్ని సాధ్యమని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాపుల ఆశలు అలాగే ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో బంగారం, డబ్బులు దోచుకునే దొంగలు ఉంటే.. ఇప్పుడు నవరత్నాల పథకాలను దొంగిలించే దొంగలు తయారయ్యారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి పెన్షన్‌ను రెండు వేలకు పెంచారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణకు సహకరించకపోగా, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. జగన్‌పై జరిగిన దాడిలో రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment