kaapu reservation
-
వారికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సయమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పాతపట్నం పరిధిలోని గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా అణచివేశారో అందరికీ తెలుసన్నారు. కాపులను ఏ విధంగా బీసీలలో చేరుస్తారని కేంద్రం అడిగిన ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన బాబు కాపులను కూడా అలాగే మోసం చేశారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. -
‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి : కాపు సామాజిక వర్గాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాపులపై చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు కాపులకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి.. ఐదేళ్లలో రూ.2వేల కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాల నష్టపోయిన కాపులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. కాపులను సీఎం వైఎస్ జగన్ అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకై ఏడాదికి రూ. 2వేల కోట్లను బడ్జెట్లో కేటాయించామని గుర్తు చేశారు. ఇచ్చిన మాటాను నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. కాపులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు కాపు సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో పెద్ద పీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులను ఆర్థికంగా ఆదుకునేందుకు బడ్జెట్లో రూ. రెండు వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల అవసరాలకోసం కాపులను వాడుకున్నారని ఆరోపించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఆ సామాజికవర్గం ఎన్నడూ మర్చిపోలేదన్నారు. కాపులంతా జగన్ వెంటే ఉన్నారు మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఐదేళ్లలో కాపులకు రూ. పదివేల కోట్లను సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన కాపులపై తప్పుడు కేసులు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కాపులమని చెప్పుకొని పార్టీ పెట్టిన నాయకులను కూడా ఆ సామాజిక వర్గం నమ్మలేదన్నారు. రాష్ట్రంలోని కాపులంతా సీఎం జగన్ వేంటే ఉన్నారని, వారందరికి ఆయన న్యాయం చేస్తారని ఎమ్మెల్యే కరణం అన్నారు. -
పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత అనేది పచ్చి అబద్ధం అన్నారు. చట్టాలను వక్రీకరించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం బూటకమన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాపులను మళ్లీ మోసం చేసేందుకే రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి? ‘పసుపు కుంకుమ’ పేరుతో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని అంబటి ఆరోపించారు. ‘చంద్రబాబు నాయుడు డ్వాక్రామహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామంటున్నారు. అప్పుగా ఇచ్చి డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక వాటిని ఇచ్చే పరిస్దితి ఉండదు. అటువంటప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి’ అని అంబటి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పసుపు కుంకుమతో మోసం చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత బాకీ ఉంటే అంత డబ్బును చేతుల్లో పెడతామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. హోదా కోసం బాబు పోరాటం అంటే ఎవరు నమ్ముతారు ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే అద్భుతం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అఖిలపక్షం పేరుతో హడావుడి చేస్తున్నారని అంబటి విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అరుణ్ జైట్లీని సన్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం బంద్‌లు చేస్తే వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టించిన విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామని బెదిరిచిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కాదన్నారు. హోదా కోసం మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్యర్యంలో జరిగే సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకావడం లేదని చెప్పారు. ఉండవల్లికి తాము వ్యతిరేకం కాదని.. ఆంధ్రులను మోసం చేసిన టీడీపీ, జనసేన నేతల మధ్య కూర్చోవడం ఇష్టం లేకనే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడంలేదని పేర్కొన్నారు. రేపు చంద్రబాబు పెట్టిన అఖిలపక్ష సమావేశానికి కూడా తమ పార్టీ హాజరుకావడం లేదని చెప్పారు. బోగస్ సర్వేల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల వేళ బోగస్ సర్వేల పేరుతో ప్రజలను గందరగోళ పరచడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని అంబటి ఆరోపించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, లగడపాటి రాజగోపాల్‌లు అర్థరాత్రి చంద్రబాబును కలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. బోగస్ సర్వేల పేరుతో వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. బోగస్ సర్వేలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి?
-
‘ఆ అధికారం చంద్రబాబుకు లేదు’
సాక్షి, గుంటూరు : రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. అసాధ్యమైనదాన్ని సాధ్యమని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాపుల ఆశలు అలాగే ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బంగారం, డబ్బులు దోచుకునే దొంగలు ఉంటే.. ఇప్పుడు నవరత్నాల పథకాలను దొంగిలించే దొంగలు తయారయ్యారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి పెన్షన్‌ను రెండు వేలకు పెంచారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణకు సహకరించకపోగా, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. జగన్‌పై జరిగిన దాడిలో రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. -
కాపు రిజర్వేషన్లపై జగన్ మాటలను వక్రీకరిస్తున్నారు
-
ముద్రగడ దీక్షను కావాలనే జటిలం చేస్తున్నారు!
రాజమహేంద్రవరం క్రైం: ముద్రగడ పద్మనాభం దీక్షను ప్రభుత్వం కావాలనే జటిలం చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టు ఆగస్టు నెలాఖరికి వస్తుంది. రెండు నెలల ముందుగానే కాపు నాయకులను అరెస్టు చేయాలని పాలక పార్టీ పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెచ్చింది' అని నిలదీశారు. ప్రభుత్వం జిల్లావ్య్యాప్తంగా వేలమంది పోలీసులను మోహరించిందని, రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డును 7 రేస్ కోర్సు రోడ్డుగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో ఐరన్ ఫెన్సింగ్ (ఇనుప ముళ్ల కంచె) వేసినట్టు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తలచుకుంటే ఈ సమస్యను గంటలో పరిష్కరించగలరు.. కావాలనే జటిలం చేస్తున్నారని అన్నారు. ముద్రగడ ఇంట్లో దీక్ష చేస్తుంటే తలుపులు పగులగొట్టి, ఆయనను, ఆయన భార్యను ఈడ్చుకురావడం, కుమారుడిని దారుణంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో పేద ప్రజలు హాస్పిటల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ సమస్యను వెంటనే చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు.