పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇస్తే లాభమేంటి? | YSRCP Leader Ambati Rambabu Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామా’

Published Tue, Jan 29 2019 12:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత అనేది పచ్చి అబద్ధం అన్నారు. చట్టాలను వక్రీకరించి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పడం బూటకమన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాపులను మళ్లీ మోసం చేసేందుకే రిజర్వేషన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement