
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో శుక్రవారం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. బడ్జెట్ సమావేశం అనంతర పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ల ప్రస్తావనే లేదు. పోలవరానికి అదనపు నిధులు ప్రకటించలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోవడం బాధకరమ’ని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment