
సాక్షి, వైఎస్సార్: పోలవరం ప్రాజెక్టు పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం మీడియాతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రవీంద్రనాథరెడ్డి, అంజాద్ బాషా, సురేష్ బాబులు మాట్లాడారు. వైఎస్ హయంలోనే పోలవరానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని వారు తెలిపారు.
చంద్రబాబు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారే తప్ప.. పోలవరం పనులు పూర్తి చేయడం లేదని నేతలు పేర్కొన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తమదైన రీతిలో నాయకులు స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీ తీసుకుంటూ పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. తాను అభిమానించే సినీ హీరో ఇంత చవట అనుకోలేదంటూ ఆయన తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment