సాక్షి, నెల్లూరు: సినీ నటుడు, జననేత అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభిమానించే సినీ హీరో ఇంత చవట అనుకోలేదంటూ ఆయన బాధపడ్డారు. ఎమ్మెల్యే అనిల్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం నుంచి బరిలో దిగిన చిరంజీవి ఎన్నికల్లో ఓడిపోగానే ఆయనను మోసం చేసిన తొలివ్యక్తి తమ్ముడు పవన్ కల్యాణేనని విమర్శించారు. చంద్రబాబుకు ఏ కష్టం వచ్చిన హడావుడి చేసే పవన్ సొంత అన్న చిరంజీవిని మాత్రం మోసం చేశాడన్నారు. బాబుకు మద్ధతు ఇస్తుండటంతో పార్టీ ఫిరాయింపులపై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
'చంద్రబాబును వెనుకేసుకు రావడం పవన్‌కు అలవాటు అయింది. పవన్ రాజ్యాంగం, విలువలు అని మాట్లాడతారు. కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటుంటే మాట్లాడలేని పవన్‌కు నైతిక విలువలున్నాయా' అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని పవన్‌ను ప్రశ్నించారు. తాను చదువుకునే రోజుల్లో పవన్ అభిమానినేనని, అయితే ఈ రోజు ఆయన తీరు ఇలా ఉంటుందనుకోలేదు. ఒకప్పుడు నేను సినిమాల్లో అభిమానించిన వ్యక్తి ఇంత చవటా అని బాధపడుతున్నానని చెప్పారు. ఆ హీరో ఇంతలా ఓ వ్యక్తి వెనకాల దాక్కుంటాడా? ఇంత అధైర్యస్తుడా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి నాకు లేదు, నేను చిన్న వ్యక్తిని అంటున్న పవన్.. ఏం నాయకుడు..? మరి దేని గురించి ప్రశ్నిస్తావంటూ ఎమ్మెల్యే అనిల్ మండిపడ్డారు.
'చంద్రబాబుకు కష్టాలొస్తే.. ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్ జగన్‌ను నువ్వు ప్రశ్నిస్తావా. మీరు మాత్రం పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు కావాలని కోరుకోవచ్చు. ప్రజల కోసం పోరాడుతున్న నేత వైఎస్ జగన్ మాత్రం ముఖ్యమంత్రి కావాలని కోరుకోకూడదా?. నీవు ఏం మనిషివి. ఎవరైనా నా గురించి మాట్లాడితే ఒప్పుకోను అంటావు. నువ్వు మాత్రం ఊర్లో వారందరి గురించి మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా. ఏపీలో అవినీతి పెట్రేగిపోతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాని గురించి ప్రశ్నించలేని వ్యక్తి దేని గురించి ప్రశ్నిస్తావు. చంద్రబాబు చెప్పే స్క్రీప్ట్ చదివే నువ్వు ఏం మాట్లాడుతావు. నువ్వు, చంద్రబాబు కలిసి ఓ పెద్ద డ్రామా కంపెనీ పెట్టుకోండంటూ' పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment