వైఎస్సార్ జిల్లా: దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంద్రబాబు బతికిపోయారని అన్నారు.
రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి రైతులను మోసగించారని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో రైతులకు మద్ధతు ధరలు కల్పిస్తామని మరిచిపోయారని ధ్వజమెత్తారు. పంటలకు మద్ధతుల ధరలు కల్పించకపోతే భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గల్ఫ్ దేశాల్లో అయితే ఉరి తీసేవారు
Published Sat, Oct 20 2018 11:54 AM | Last Updated on Sat, Oct 20 2018 11:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment