
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. డీజీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇక్బాల్ ఖండించారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. కేసులను వైఎస్ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.
త్వరలోనే విముక్తి పొందుతారు..
త్వరలోనే కడిగిన ముత్యంలా జగన్ కేసుల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. చంద్రబాబుపై 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని..కోర్టు స్టే ద్వారా తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని..కేసుల భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఘనుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్శపాలన అందిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నాశనం చేసిన వ్యవస్థలకు సీఎం జగన్ రిపేర్ చేస్తున్నారని ఇక్బాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment