
సాక్షి, అమరావతి : ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తూర్పారబట్టారు. (హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!)
‘పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా’ అని విజయసాయి రెడ్డి గురువారం ట్వీటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ)
కాగా కొన్నాళ్లుగా చంద్రబాబు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్‌ల్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా ఈ భేటీపై టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా దీనిపై పెదవి విప్పడం లేదు. (నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు?)
Comments
Please login to add a commentAdd a comment