Park Hayat Hotel
-
ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా..
సాక్షి, అమరావతి : ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తూర్పారబట్టారు. (హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) ‘పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా’ అని విజయసాయి రెడ్డి గురువారం ట్వీటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ) కాగా కొన్నాళ్లుగా చంద్రబాబు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్ల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా ఈ భేటీపై టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా దీనిపై పెదవి విప్పడం లేదు. (నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు?) -
మహేశ్ ‘హంబుల్’ లాంచ్ వేడుక
-
సీఎంకు రెండు క్యాంప్ ఆఫీసులు ఉండవు
-
11 రాష్ట్రాలు.. 17 నగరాలు.. 30 చోరీలు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లోకి దర్జాగా ప్రవేశించి నూతన జంట బస చేసిన గదిలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడి అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. పార్క్‌హయత్ చోరీకి పాల్పడిన జయేశ్ రావ్జీ సేజ్‌పాల్(45)ను బంజారాహిల్స్ పోలీసులు ముంబైలోని థానే రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్ జోడియా ప్రాంతానికి చెందిన జయేశ్ ఈ నెల 6న రాత్రి పార్క్‌హయత్ హోటల్లోకి ప్రవేశించి హిమాయత్‌నగర్‌కు చెందిన యువ వ్యాపారి వెంకట్ కోనారావుకు చెందిన బంగారు ఆభరణాలు తస్కరించిన విషయం తెలిసిందే. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని దర్యాప్తులో తేలింది. నిందితుడు దేశంలోని 11 రాష్ట్రాల్లో 17 నగరాల్లోని పలు స్టార్ హోటళ్లలో ప్రవేశించి 30 దొంగతనాలు చేసినట్లు తేలింది. గత 20 సంవత్సరాలుగా స్టార్ హోటళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి చోరీని ప్రారంభించిన నిందితుడు హైదరాబాద్‌లో మూడు హోటళ్లలో, విశాఖపట్నంలో నోవాటెల్ హోటళ్లలో దొంగతనాలు చేశాడు. -
వస్త్రధారణపై వివియన్ రిచర్డ్స్ కుమార్తె వ్యాఖ్యలు
బంజారాహిల్స్: నలుగురిలో ప్రత్యేకంగా నిలిపేవి, మన వ్యక్తిత్వాన్ని చాటే దుస్తులను ధరించాలని బాలీవుడ్ నటి నీనాగుప్తా, వెస్టిండిస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ల కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా పేర్కొన్నారు. బంజారాహిల్స్ పార్క్‌హయత్ హోటల్లో ఫిక్కీ ఎఫ్ఎల్వ్ ఆధ్వర్యంలో ‘ డిజైన్ యువర్ పర్సనాలిటి ’ పేరుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రపంచ ఫ్యాషన్ పరిశ్రమలో మన దేశం ఇప్పుడిప్పుడే సత్తా చాటుతోందన్నారు. సోనమ్ కపూర్, అలియాభట్ సహా పలువురు నటీమణులకు తాను దుస్తులు డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. రిట్జ్ మ్యాగజైన్ ఎడిటర్ వనజా బంగారి కార్యక్రమ సంధానకర్తగా వ్వవహరించారు. ఎఫ్ఎల్వో చైర్పర్సన్ పద్మారాజగోపాల్ సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం కేసీఆర్
బంజారాహిల్స్ : హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటికే అత్యుత్తమ నివాసిత నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి అన్ని ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో సోమవారం రాత్రి బ్రది విశాల్ పన్నాలాల్ పిత్తి 88వ జయంతిని పురస్కరించుకొని 13వ స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 1969 ఉద్యమంతో పాటు 2001 ఉద్యమంలో చనిపోయిన వారి చరిత్రను ప్రతిబింబించేలా స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం స్థలాన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు. నగరాభివృద్ధి ప్రణాళికకు ఇప్పటికే కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేసుకున్నామని తద్వారా నగరంలో ఉన్న సమస్యలపై దృష్టిసారించి దాన్ని పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బ్రది విశాల్ రూపొందించిన పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌రావు, సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు, శరత్ పిత్తి, అక్షయ్పిట్టి పాల్గొన్నారు. -
గ్రాండ్‌గా చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్
-
మెగా బర్త్‌డే సందడి