
అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే వారి ధైర్యానికి జోహార్లని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ‘విత్తనాల సేకరణకు రూ.380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ.’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారని, తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment