సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొంత ఊపందుకుంది. మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం జెడ్పీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు కన్నా.. ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు ఎక్కువగానే దాఖలయ్యాయి. మొదటి విడతలో కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం మండలాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో మంగళవారం కామేపల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.
మొదటిరోజు జెడ్పీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కామేపల్లి మండలంలో 7, ఖమ్మం రూరల్ మండలంలో 1, కూసుమంచిలో 11, ముదిగొండలో 6, నేలకొండపల్లిలో 1, సింగరేణి లో 11, తిరుమలాయపాలెం మండలంలో 5 నామి నేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి టీఆర్‌ఎస్ తరఫున 18, కాంగ్రెస్ 16, బీజేపీ ఒకటి, సీపీఎం 10, టీడీపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థుల తరఫున 8 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం రెండు రోజుల్లో 54 నామినేషన్లు దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment